1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎడారిలో

ఎడారిలో
                 

                                 -  Stephen Crane


ఎడారిలో 
చూశానో ప్రాణిని , నగ్నంగా , మృగప్రాయంగా, 
బాసీపట్టు వేసికూర్చుని నేలమీద , 
తన చేతిలో తన హృదయాన్ని పట్టుకొని 
ఆరగిస్తున్నాడు .
నేనన్నాను , " బాగుందా , స్నేహితుడా  ? "
" ఇది చేదు -చేదు , " అతని సమాధానం , 
" కానీ ఇష్టపడతాను 
చేదుగా వుంది కాబట్టి ,
ఇది నా హృదయం కనుక ."     


కవిత పేరు :In the Desert
మూలకవి    : Stephen Crane
దేశం            : America


ఆగ్రహంలో దేముడు


(  A GOD IN WRATH  )

             ___   స్టీఫెన్  క్రేన్ .


ఆగ్రహంలో దేముడు
దండిస్తూ  ఒక మనిషిని ;
వాడిని చరుస్తూ అతడు అరుస్తూ బిగ్గరగా
మేఘఘర్జనలతో విసురుతూంటే
భూమిమీదుగా గింగిర్లెత్తుతూ ఆ ధ్వనులు.
చేరారు ప్రజలంతా పరుగుతోవచ్చి .
ఆ మనిషి కేకలేస్తూ ప్రయాసపడుతూ,
కాస్తంత పిచ్చిగా దేముడి పాదాలవద్ద ,
ప్రజలు అరిచారు
" అహో ఎంత దుర్మార్గమైన మనిషి ! "
" ఆహా  ఎంత శత్రుభయంకరుడైన దేముడు ! "